నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం

 



 నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం

నిన్న, నేడు, నిరంతరం మారని దేవా... (2)

పల్లవి : 

ఈ లోకమంతా నేను వెతికినా, నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం...

నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపిన నా హృదయం పొంగెను..(2)


చరణం: 1 

1.ఈ లోకం ఒక మాయ అని తెలుసుకున్నాను...

ఏది నా సొంతం కాదని అనుకున్నాను... (2)

తప్పిపోయిన కుమారుని నేనయితే

నా కొరకే నిరీక్షించే తండ్రి నా యేసు (2)


చరణం 2: 

2.ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్య..

ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా ..(2)

నన్ను మరువని ప్రేమ నీదయ్యా

నన్ను మార్చిన ప్రేమ ..

నీదే యేసయ్యా ...(2)