FOR VIDEO CLICK HERE 👇
యేసుక్రీస్తు శిలువ వేయడానికి ముందు వారం ఎం జరిగింది? ఆయన ఏమేం చేశారు? ఎక్కడెక్కడి వెళ్ళారు? ఎవరిని కలిశారు? అనే విషయాలు గురించి తెలుసుకుందాం..
ఎందుకంటే ఈ చివరి వారం ఎంతో ప్రాముఖ్యమైనది... ఈ వారం లోనే ఆయన ఎంతగానో శోధించబడ్డారు.. ఎన్నో ఉపమానాలు ఇచ్చారు... మరెన్నో బోధలు చేశారు... రెండవ రాకడ గురించి... యెరూషలేము 2వ దేవాలయం గురించి ఇలా ఎన్నో వాటి గురించి వివరంగా బైబిల్ లో చూడొచ్చు..
యేసుక్రీస్తు యొక్క చివరి వారం ఆదివారం తో మొదలు అయింది...
ఆదివారం
ఇప్పుడు మనం దీనినే మట్టల ఆదివారం అంటున్నాం..అంటే శిలువ వేయడానికి 6 రోజుల ముందు... ఒక్కసారి మనం మత్తయి 21:1-17, మార్కు సువార్త 11:1-11, లుకా సువార్త 19:28-48, యోహాను 12:12-50 వచనలలో చూస్తే యేసు క్రీస్తు గాడిద మీద ఎక్కి యెరూషలేము వీధుల గుండా ఊరేగింపు గా వెళ్లినట్టు మనం చూడొచ్చు... ఆయనను చూసి అందరూ ప్రభువు పేరిట వచ్చువ్వానికి జయము అని గట్టిగ కేకలు వేస్తున్నట్టు ఈ వచనాలలో చూడొచ్చు...
(మత్తయి 21:9) (లూకా 13:35)(మార్కు 11:10)(యోహాను 12:13)
ఈ వచనాల ద్వారా యేసు క్రీస్తు... పాత నిబంధనలో జెకర్య ముందుగానే ప్రవచించిన వాక్యాన్ని నేరవెర్పు జరిగింది అని మనం అర్టంచేస్కోవొచ్చు... ఒక్కసారి ఆహ్ వచనాలు చూద్దాం...
zecheraih 9:9
సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు.
( జెకర్యా 9 : 9 )
ఆ తరువాత యేసు దేవాలయానికి వెళ్లి అక్కడ ప్రవచించిన .. అక్కడ రూకలు మారుస్తున్న వారిని వెళ్లగొట్టి... కుంటివారిని ,గుడ్డి వారిని బాగుపరిచినట్టు మనం( మత్తయి సువార్త 21:12-14 వచనాలు లో చూడొచ్చు...
అదే రోజు యేసు యెరూషలేము ని వదిలి బేతనియ ప్రాంతం లో తన సన్నితులునాయిన మార్త,మరియ లాజరు ఇంటి వద్ద బస చేసినట్టు మనం ఈ వచనలలో మనం బైబిల్ గ్రంధములో
లో చూడొచ్చు...
సోమవారం
ఆ తరువాతి రోజు సోమవారం యేసు తిరిగి బెతనియ నుంచి యెరూషలేము కి వెళ్తున్నప్పుడు దారిలో ఆయన ఆకలింగొని చెట్టు నిండా ఆకులు ఉన్న ఆంజురపు చెట్టు నీ చూసి దాని వద్దకు వెళ్లి చూడగా అక్కడ కాయలు లేకపోవడం తో ఆ చెట్టు ను యేసు శపించినట్టు మనం మత్తయి 21:19 మార్కు 11:12-14) వచనాలలో చూడొచ్చు...
మంగళవారం
యేసు రోజంతా యెరూషలేములో మత పెద్దలతో కలహించుకుంటూ, ఉపమానాలు బోధిస్తూ, రోగులను స్వస్థపరిచాడు.
అతను గొప్ప భోజనం, మంచి మరియు చెడ్డ సేవకులు, పది మంది కన్యలు, ఇద్దరు కుమారులు, ద్రాక్షతోట యజమాని, వివాహ విందు కు సంబంధిన ఉపమానాలను బోధించినట్టు మనం
(మత్తయి 21:23-39; మార్క్ 11:20- 12:44; లూకా 20:1-21:4; జాన్ 12:20-50). వచనాలలో చూడొచ్చు...
అంతే కాదు యేసు ఒక గొప్ప ఆజ్ఞను కూడా ప్రకటించాడు.. అదే "నీ పూర్ణహృదయముతో నీ పూర్ణ ఆత్మ తోను నీ దేవుడైన యెహోవా ను ప్రేమించుము అని చెప్పినట్టు మనం " (మత్తయి 22:37). లో చూడొచ్చు...
శాస్త్రులు , పరిశయ్యులకి వచ్చే కష్టాలు గురించి చెప్పాడు...
అతను శాస్త్రులు మరియు పరిసయ్యులకు కష్టాలు చెప్పనట్టి (మత్తయి 23:13-39, లో చూడొచ్చు...
అంతే కాదు యేసు ఒక పేద విధవరాలు తనకి ఉన్నది అంత ఇచ్చినది చూసి ఆహ్ పేద విధవరాలు ను ఆయన మెచ్చుకున్నారు...
ఆహ్ తరువాత పరిశయ్యులు ఎలా అయిన యేసు నీ ఇరికించలి అని ఆయన శోధించడానికి... రోమన్ పన్నులు గురించి ఆయనను అడుగగా... కైసరేయ ది కేసర్య కి .. దేవునుడి దేవునికి ఇవ్వమన్ని యేసు చెప్పినట్టు మనం మార్కు 12:17; లూకా 20:20-26). చూడొచ్చు..
ఆహ్ తరువాత ఆయన తనకి రాబోయే మరణం గురించి... మరియు ఆయన రహస్యం గా వచ్చే పునారుద్ధనం గురించి చెప్పాడు... కానీ శిష్యులు ఆయన మాటల్ని గ్రహించలేకపోయారు...
యేసు యెరూషలేముకు ఎదురుగా ఒలీవ కొండపై కూర్చున్నప్పుడు, నగరం యొక్క రాబోయే నాశనాన్ని తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాట్టు (మత్తయి 24).లో చూడొచ్చు
యేసు తన రెండవ రాకడ చుట్టూ ఉన్న సంకేతాలు మరియు అద్భుతాలను కలిగి గురించి ఒలివెల కొండ వద్ద ప్రసంగాన్ని బోధిస్తూ మిగిలిన సాయంత్రం గడిపినట్టు (మత్తయి 24-25; మార్కు 13; లూకా 21:5-38). వచానాలలో చూడొచ్చు...
. లేఖనాలలో యేసు అంత్య కాలాల గురించి తన అవగాహనను పంచుకున్న ఏకైక ప్రదేశం ఇదే
బుధవారం
యేసు బెత్తనియ లో కుష్టి రోగి అయిన సీమోను ఇంట్లో ఉన్నప్పుడు
మరియ ఎంతో విలువగల అచ్చ జటామాంసి అత్తరును యేసు పాదములకు పూసి తన తలవెండ్రుకలతో ఆయన పాదములు తుడిచినట్ట గా మనం మత్తయి 26:6-13; మార్కు 14:3-9 ( యోహాను సువార్త 12 : 3) వచనలల్లో చూడొచ్చు.
అపుడు 12 మంది శిష్యుల్లో ఒక్కడు అయిన ఇస్కరియోతు యూదా మరియ పై కోపడ్డి దానిని బీదలు కి ఇవ్వాల్సింది అనగా.. అందుకు యేసు
మరియ ను ఆపకండి ఆమె నన్ను పాతిపెట్టు దినమునకు ముందుగానే నన్ను అభిషేకించినది అని చెప్పినట్టు...
( యోహాను సువార్త 12 : 7 )
వచనాలు లో చూడొచ్చు...
ఇదే దినమున ఇస్కరియోతు యూదా.. ప్రధాన యజకుల వద్దకు వెళ్ళి... తాను యేసు నీ పట్టిస్తే తనకి ఏమి ఇస్తారు అని అడుగగా? ప్రధాన యాజకులు అతనికి 30 వెండి నాణాలు ఇస్తాము అని చెప్పినట్టు మనం ఈ వచనల్లో చూడొచ్చు...
(మత్తయి 26:15)
గురువారం
ఈ దినమున యేసు చివరి బల్ల భోజనాన్ని తన శిష్యులతో కలిసి చేశారు... దీనినే ఇంగ్లీష్ లో లాస్ట్ సప్పర్.. అంటారు..
ఇది ఎంతో ప్రాముఖ్యమైనది...
ఆయన తన శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్న సమయం లో తనని అప్పగించబోవు యూదా గురించీ యెరిగి ఒక రొట్టె ముక్కని విరిచి.. ఇది ఎవరికీ ఇస్తానో అతను అప్పగించువాడు అని ... యేసు యూదా కి ఇచ్చి... ద్రాక్షరసము తీస్కొని ఇది నా రక్తము... ఇది మొదలుకొని నేను మళ్ళీ మిమ్మల్ని నా తండ్రి రాజ్యంలో చూసేవారు దీనిని తాగాను అని... వారితో చెప్పినట్టు మనం ఈ వచనలాల్లో చూడొచ్చు... (మత్తయి 26:9)
ఆ తర్వాత ఆయన తన శిష్యుల పాదాలను కడిగి వారికి ఆయన రాజ్యము గురించి... తన ద్వారానే తన తండ్రి వద్దకు రాగలరాని... కాబట్టి తనని నమ్మమని.... తన నామమున ఎది అడిగినను ఆయన ఇస్తాను అని ఇలా ఎన్నో విషయాలను తన శిష్యులతో మాట్లాడారు...
ఈ మాటలు చెప్పి యేసు గేత్సేమనే తోట వద్దకు వెళ్లి తన శిష్యులు తన కోసం ప్రార్థన చేయమని అడిగి.. తాను వెళ్లి ఒక రాయి వద్ద కూర్చుని... మిక్కిలి ఏడుస్తూ... తన తండ్రి కి ప్రార్థన చేశాడు... ఆయన ఎంతగానో శ్రమపడి చేసిన ప్రార్థన గా మనం బైబిల్ గ్రంధం లో చూడొచ్చు.. అప్పుడు ఆయనకి పరలోకం నుండి ఒక దేవదూత పరిచరికం చేసినట్టుగా మనం చూడొచ్చు... (లూకా 22:44)
ఇస్కరీయోతు యూదా సైన్యాన్ని వెంటబెట్టుకుని యేసు ఉన్న స్థలమునకు ఒచ్చి ఆయనకు ముద్దు పెట్టి.. తనే యేసు అని సైనికులకు తెలియజేశాడు...
వెంటనే పేతురు సైనికుని కొట్టి తీస్కొని ఒక సైనికుని చెవిని కోసి వేశాడు.. అది చూసి యేసు ఆహ్ సైనికుని చేవి నీ ప్రేమ తో నిమిరి తిరిగి చెవిని ఇచి బాగుపరిచాడు...
ఆ తరువాత యేసు వారిని బంధించి పిలాతు వద్దకు టిస్కుని పోయిరి...
శుక్రవారం
యేసు ను చంపాలని చూసిన ప్రధాన యాజకులు వద్దకు ఇస్కరియితో యూదా వచ్చి తాను ఒక నిరపరదిని అప్పగించమని బాధతో 30 వెండి నాణాలను దేవాలయంలో పారవేసి... ఇంటికి వెళ్లి ఉరి వేసుకుని వేసుకుని చనిపోయినట్టు మనం మత్తయి 27 అధ్యాయం లో చూడొచ్చు...
ఆహ్ 30వెండి నాణాలు రక్త ధనం కాబట్టి ఆహ్ ధనము కుమ్మరి వాని పొలం కొన్నట్టు మనం ఈ వచనలలొ చూడొచ్చు...మత్తయి 27:7
అయితే ఇదింకుందుగానే వెండి నాణములు తీసికొనిఒ ప్రభువు నాకు నియ మించినప్రకారము వాటిని కుమ్మరి వాని పొలమున కిచ్చిరి అని ప్రవక్తయైన యిర్మీయాద్వారా చెప్పబడినమాట నెరవేరెనట్టుగా చూడొచ్చు...
యేసు ను పొంతి పిలతు దగ్గరకు తీస్కెల్లి ఆయనపై నేర ఆరోపనలు చేశారు.. కానీ పిలాతు ఈయనై నాకు ఎలాంటి దోషం కనిపించడం లేదు అని చెప్పగా.. యేసు సిలువ వేయమని అందరూ బిగ్గరగా కేకలు వేసి... యేసు ను శిలువ వేసి... బరబ్బాను వొదిలి పెట్టమని అక్కడ ఉన్న వారంతా బిగ్గర గా కేకలు వేసినట్టు ఈ వచనాలు ద్వారా మనం చూడొచ్చు... (మత్తయి 27:11-31; మార్కు 15:1-20; లూకా 23:1-25; యోహాను 18:18-19:16).
అందుకు పిలాతు
యేసు ను శిలువ వేయడానికి అప్పగించెను...
క్రీస్తు ను తీస్కొని వెళ్లి ఆయనను ముళ్ళ కిరీటం పార్టీ ఆయన వస్త్రములు తీసి వేసి.. ఆయనని కొరడాలతో కొట్టి యూదుల రాజు అని ఆయనను ఉమ్మివేసి అపహించినాటు ఇక్కడ మనం చూడొచ్చు... (లూకా 23:13-25) (మత్తయి 26:57-27:10; మార్కు 14:53-72; లూకా 22:54-71; యోహాను 18:12-27).
ఆ తరువాత ఆయనను గొల్గోత కొండ వరకు శిలువ ను మోయిస్తు .. కొరడాలతో కొడ్తూ తీస్కొని వెళ్లి ఆహ్ కొండ మీద ఆయనను ఇద్దరు దొంగల మధ్యలో శిలువ వేసి... ఆయన యూదుల రాజు గా చెప్పనా నేరం అని రాసి శిలువ వేశారు...
ఆయన దప్పిక అనినదిగినప్పుడు ఆయనకి చేదు చిరకు ను ఇచ్చారు.... యేసు మధ్యాహ్నం 3 గంటలకు తండ్రి సమాప్తమైనది అని గట్టిగా అరుస్తూ ఆయన చనిపోయినట్టు ఈ వచనాలు ద్వారా మనం తెలుసుకోవచ్చు...
(మత్తయి 27:32-61; మార్కు 15:21-47; లకా 23:26-56; యోహాను 19:17-47
ఆ రాత్రి అరిమతయి యోసేపు యేసు యొక్క దేహాని పిలాతు నునదిగి అడిగి తీస్కొని వెళ్లి తన సొంతం స్తథలం లో ఆయనని తెల్లని వస్త్రాలలో చుట్టి పాటి పెట్టినట్టు మనం ఈ వచనాలు ద్వారా చూడొచ్చు...
( యోహాను 19:38-42).
శనివారం
ఆయన శనివారం సమాధి లో ఉన్నారు... అయితే పేతురు వ్రాసిన పత్రిక ప్రకారం ఆయన శిలువ వేయబడటింకి ముందు... పాటనిబందన లోంచనిపోయిన వారిని చెరలో ఉన్న వారినింకలిసి బొదించినట్టు గా మనం ఈ వచనాలు ద్వారా చూడొచ్చు...
( 1 పేతురు 3 : 20 )
ఆదివారం
ఈ దినం ఎంతో ప్రాముఖ్యమైనది... ఈ దినాన్ని నేడు పునారుద్ధను దినం గా పిలుస్తున్నారు... దీనినే ఇంగ్లీష్ లో ఈస్టర్ అని పిలుస్తారు...
ఆ దినమున తెల్లవారు జామున యేసు యొక్క శరీరాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేయాలని మరియ క్రీస్తు సమాధి వద్దకు వెళ్లింది... ఆహ్ సమాధి యొక్క రాయి పక్కకు తొలిగి ఉండటం చుసి కంగారు తో మరియ లోపలికి వెళ్లి చూడగా అక్కడ క్రీస్తు దేహం లేదు...
అప్పుడు మరియ ను ఒక దేవదూత సజీవుడు అయిన ఏసును మృతులలో ఎలా వేతుకుచున్నావు ? ... ఆయన సజీవుడై తిరిగి లేచెను ఈ విషయం అందరికి చెప్పమని మరియకు చెప్పినట్టు ఈ వచనాలు ద్వారా మనం చూడొచ్చు లూకా 27:63
అప్పుడు మరియా పరిగెత్తుకుంటూ శిష్యుల వద్దకు వెళ్ళి చెప్పిన వాళ్ళు ఎవరు నమ్మలేదు.. ఆహ్ తర్వాత యేసు క్రీస్తు ఎన్నో సార్లు తన చనిపోయిన తిరిగి లేచిన తరువాత వారికి కనిపించినట్లు మన బైబిల్ వాక్యాల ద్వారా తెల్సుకోవచ్చు...
పునరుద్ధణ తరువాత యేసు క్రీస్తు వారు ... 40 రోజుల పాటు శిష్యులు కు కనిపిస్తూ... ఆహ్ తరువాత ఒలివల కొండ వద్ద ఆరోహనం అయినట్టు మనం ఈ వచనలలో చూడొచ్చు.... లూకా 24:51
ఈ విధంగా గా యేసు క్రీస్తు వారి చివరి గడిచింది ... ఈ వారం లో ఆయన గడిపిన ప్రతి క్షణం ఎంతో విలువైనది.. ఆయన చెప్పిన ప్రతి. మాట మరెంతో విలువైనది... ఆయన మన కోసం మనం పాపాల కోసం ఆయన తన రక్తాన్ని చిందించారు...
మనం పాపాల నిమిత్తం ఆయన సిలువపై మరణించారు.. మన కోసం చనిపోయిన ఆయనకి తిరిగి మనం ఏమి ఇస్తున్నాం ఒక్కసారి మీ మనస్సులను మీరు అడిగి చూడండి...
ఆయన మన నుంచి ధనాన్ని ఆశించటం లేదు.. కేవలం మారు మనస్సు ఆశిస్తున్నాడు...
సమయం లేదు...రాకడ అతి దగ్గరలో ఉంది... నేడే యేసు ను ఎరిగి ఆయనని మనస్ఫూర్తిగా నీ దేవునిగా.. నీ రక్షకుని గా.. స్వీకరించి...
ఆయన ను పూర్ణ ఆత్మతోను .. పూర్ణ బలము తొను ఆరాధించి... జీవ గ్రంధం లో పేరు మనందరి ఉందులాగున బ్రతుకుదాం...
రాకడ కొరకు సిద్ధపడుడాం... ..ఆమెన్