ఊహించలేనయ్యా వివరించలేనయ్యా

 




ఊహించలేనయ్యా వివరించలేనయ్యా – ఎనలేని నీ ప్రేమను (2)


నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2)

తరియించు వరమే దొరికెను (2)


1. నా మనసు వేదనలో – నాకున్న శోధనలో – ఉల్లాసమే పంచెను

ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో

మధురామృతమునే నింపెను (2)

అనాధైన నను వెదకెను ప్రధానులతో ఉంచెను (2) ఓ..ఓ..ఓ..ఓ..


2. నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలు – నీ ప్రేమ రుజువై నిలిచెను

వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో

  నా హృదయమే కరిగెను (2)

 ఇది నీ ప్రేమకే సాధ్యము – 

వివరించుట నాకసాధ్యము (2) ఓ..ఓ..ఓ..ఓ