నేను నా ఇంటి వారను సాంగ్ లిరిక్స్
Song Lyrics.
పల్లవి :
నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము
ఆయనే సజీవుడని ఆయనే విజేయుడని (2)
సిలువలోన నీకు నాకు విజయము చేకూర్చెనని
1. శ్రమలో శోధనలో మరణ బంధకములో
శాంతి సమాధానం దయచేసిన దేవుడు (2)
ఆశా నిరాశలలో ఆవేదన వలయములో (2)
ఏ దేవుడు చేయలేని అద్భుతములు చేసినాడు (2)
2. ఏ పాపము నన్ను ఏలనీయని వాడు
ఏ అపాయమును రాకుండా కాపాడును (2)
కునుకు పాటు లేనివాడు నిదురపోని దేవుడు (2)
నేను నమ్మినవాడు నమ్మదగిన దేవుడు (2)
3. దీర్ఘాయువు చేత దీవించు దేవుడు
దీర్ఘ శాంతముతో దీనత్వము నేర్పును (2)
మేలు చేత నా హృదయం తృప్తిపరచు దేవుడు (2)
మేలు చేత
కీడునెలా జయించాలో నేర్పును (2)