యేసు క్రీస్తు నేల పై ఏం రాశాడు ?

 పరిసయ్యులు వ్యభిచారం లో పట్టుబడిన స్త్రీ నీ 

యేసుక్రీస్తు వద్దకు తీస్కుని వచ్చినప్పుడు

 ఆయన నేలపై ఏం రాశాడు ? 

పరిసయ్యులు ఆహ్ స్త్రీ నీ ఎందుకని క్రీస్తు వద్దకు తీస్కుని వచ్చారు? 


ఆయనను ఏ విధంగా  ఇరికించాలని వారు ప్రయత్నించారు? 

యేసు క్రీస్తు వారికి ఏ విధం గా బుద్ధి చెప్పారు  అనే విషయాలు గురించి పూర్తిగా తెలుసుకుందాం...


ఒక్కసారి మనం యోహాను 8:1-11 లో చూస్తే..


పరిసయ్యులు  వ్యభిచారం చేస్తూ పట్టుబడిన ఒక స్త్రీ నీ యేసు వద్దకు తీస్కుని వచ్చి తాను వ్యభిచారం చేస్తూ పట్టుబడింది అని తనని మోషే ధర్మ శాస్త్రం ప్రకారం రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పారు...



అయితే వారు ఇక్కడ ఎలా అయిన క్రీస్తుని ఇరికించాలని చేసిన పన్నాగం ల చూడొచ్చు.. ఎందుకంటే... మోషే ధర్మ శాస్త్రం ప్రకారం వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ నీ రాళ్ళతో కొట్టమని చెబుతుంది.. 

కానీ రోమన్ ప్రభుత్వం ప్రకారం యూదులకు ఒక మనిషిని చంపే హక్కు అర్హత లేదు... ఒకవేళ క్రీస్తు ఆహ్ స్త్రీ నీ రాళ్ళతో కొట్టమని చెప్పి ఉంటే రోమన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చాడని ఆయన పై నేరారోపణ చెయ్యాలని.. 

లేదంటే ఆ స్త్రీ నీ వదిలేయమంటే మోషే ధర్మ శాస్త్రాన్ని వ్యతిరేకించాడు అని గోల చేయాలని వారు కుటిల ఆలోచనలతో ఆయన వద్దకు ఆహ్ స్త్రీ తీస్కుని వచ్చినట్టు మనం చూడొచ్చు.. 

అయితే క్రీస్తు వారి మాటలు విని వారితో మాట్లాడకుండా.. కిందకు వంగి తన చేతి వ్రేలితో నేల మీద రాయడం మొదలు పెట్టాడు...  



అలా రాస్తూ వారి వైపు చూసి...

"మీలో ఎవరైనా పాపం చేయని వారైతే , ఆమెపై మొదట రాయి విసరాలి " అని చెప్పినట్టు మనం  ( యోహాను 8:7  లో చూడొచ్చు..అలా చెప్పి ఆయన వంగి నెల మీద రాయడం మొదలు పెట్టాడు.. . 

అప్పుడు యూదుల నాయకులు, పరిసయ్యులు ఒకోక్కరి గా అక్కడి నుంచి వెళ్లిపోవడం మొదలు పెట్టారు

అయితే ఇక్కడ చాలా మందికి ఉండే ప్రశ్న

 యేసు క్రీస్తు నెల మీద ఏం రాశాడు? 

యూదుల ఎందుకని వెళ్ళిపోయారు ? 



నిజానికి యూదుల నాయకులు అప్పటికే పురుషుడు లేకుండా స్త్రీని మాత్రమే తీస్కుని వచ్చారు... మోషే  ధర్మశాస్త్రాన్ని విస్మరించారు మోషే ధర్మ శాస్త్రం ప్రకారం . వ్యభిచారానికి పాల్పడే స్త్రీ, పురుషుడు,

ఇరువురినీ రాళ్లతో కొట్టాలని చట్టం  ( లేవీయకాండము 20:10 ; ద్వితీయోపదేశకాండము 22:22 ).లో చూడొచ్చు... అయితే యూదుల  నాయకులు యేసును మోసగించడానికి స్త్రీని ఒక ఉచ్చుగా ఉపయోగించాలని అనుకున్నారు..

 ఒకవేళ స్త్రీని రాళ్లతో కొట్టకూడదని యేసు చెబితే, వారు మోషే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారని నిందిస్తారు. అతను ఆమెను ఉరితీయమని వారిని కోరినట్లయితే, వారు అతనిని రోమన్లకు నివేదించారు, 

వారు యూదులు తమ స్వంత మరణశిక్షలను అమలు చేయడానికి అనుమతించలేదు ( యోహాను 18:31 ).లో చూడొచ్చు... 



అయితే యేసు నెల మీద తన వేలితో యూదుల నాయకుల పాపాల జాబితా రాసి ఉంటాడు అని చాలా మంది బైబిలు నిపునులు అభిప్రాయపడుతున్నారు...

అయితే అలా ఎందుకు చేశాడు దాని వెనుక ఉన్న కారణం ఏంటి? ఏం రాశాడు విషయాలు ఇప్పుడు మనం చూద్దాం 

ఒక్కసారి మనం యిర్మీయా 17:13 లో  చూస్తే... యేసు క్రీస్తు వ్రేలు తో ఎందుకు రాసారో...దాని వెనుక ఉన్న రహస్యం ఇక్కడ చూడొచ్చు... ". అయితే అది చెప్పేముందు ఒక్కసారి   కొద్దిగా హిబ్రూ చరిత్రను చూద్దాం... 

వ్యభిచారంలో ఎవరైనా పట్టుబడినప్పుడల్లా, స్త్రీ మరియు పురుషులిద్దరినీ నికానోర్ ఆలయ ద్వారాల వద్దకు తీసుకువచ్చి నిందించబడతారు. వ్యభిచారం నిజంగా జరిగిందని ధృవీకరించడానికి సాక్షులను సేకరించగలిగితే, తీర్పును తీసుకురావడానికి ఒక నిర్దిష్ట వేడుక జరుగుతుంది. 

అయితే, ఇక్కడ ఈ సందర్భంలో వారు మహిళను మాత్రమే తీసుకువచ్చారు. ఇది దేవుని మౌఖిక చట్టాన్ని ఉల్లంఘించడమే.

రెండవది, పూజారి కిందకు వంగి, ఉల్లంఘించిన చట్టాన్ని, నిందితుల పేర్లతో పాటు, ఆలయ నేలపై దుమ్ములో వ్రాయవలసి ఉంటుంది దీనినే యేసు క్రీస్తు చేసింది..  [వాస్తవానికి, పూజారి చట్టాన్ని వ్రాయగలడు. అది కూడా ఎక్కడ ఐతే పేర్లు, గుర్తులు శాశ్వతంగా ఉండకూడని చోట రాయాలి..

 కాబట్టి  ఇలా చేయడం ద్వారా, ఈ నిందారోపణులు వారు ధర్మశాస్త్రాన్ని పాటించడం లేదని, అర్థం.. ఎవరిని అయిన నేరం చేశారు నిరూపించడానికి  (ప్రక్కన ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు ఉండాలి.. అయితే క్రీస్తు వద్దకు తెచ్చిన మహిళా విషయంలో పరిశయ్యులు,పెద్దలు ఇవేం పాటించలేదు... ఇక్కడ సాక్ష్యులు గాని.. లేదా ఆమె వ్యభిచారం చేసిన పురుషుడు గాని లేదు. 

కాబట్టి యేసు లేచి నిలబడి (వారు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని స్పష్టంగా చూపించిన తర్వాత) మరియు "మీలో పాపం లేనివాడు, మొదట ఆమెపై రాయి వేయనివ్వండి" అని చెప్పాడు యోహాను 8:7 ). వారు రాయి వేయడానికి ఇష్టపడలేదు, యేసు ఆమెను ఖండించాలని వారు కోరుకున్నారు, కాబట్టి వారు నిందలు వేయడం కొనసాగించారు.. 

ఇప్పుడు మనం యిర్మీయా 17:13 లో ఏముందో  తెలుస్కుందాం..


యెహోవా, ఇశ్రాయేలీయుల నిరీక్షణయైన యెహోవా, నిన్ను విడిచిపెట్టిన వారందరు సిగ్గు పడతారు, నన్ను విడిచిపెట్టిన వారు భూమిపై వ్రాయబడతారు, ఎందుకంటే వారు జీవ జలాల ఊట అయిన యెహోవాను విడిచిపెట్టారు.

ఈ వచనాలు బట్టి యిర్మీయా ముందుగానే పరిసయ్యులు దేవుని చట్టాన్ని విరుద్ధం గా చేస్తారు అని ప్రవచించినట్టుగా మనం చూడొచ్చు...

అందుకే యేసు వారు చేసిన తప్పును వారు ఎరిగి పశ్చతాప పాడాలి అని క్రీస్తు తప్పు చేయని వారు ఆహ్ స్త్రీ మీద రాయి వేయాలి అని చెప్పగా.. 

వారు కేవలం క్రీస్తు ను ఇరికించాలని అనుకున్నారు కాబట్టి అక్కడి నుంచే మౌనం గా వెళ్ళిపోవడం మనం చూడొచ్చు..... 

ఇలాగే పరిసయ్యులు, సద్దుకయ్యులు, పెద్దలు వలె మనం కూడా ఎన్నో తప్పులు, పాపలు , మరొకరి మీద నిందలు వేస్తూ ఉంటాం..

కాబట్టి క్రీస్తు మన తప్పులను మనకి చూపించినప్పుడు వాటిని ఎరిగి, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి... పశ్చాతాపం పడి క్రీస్తులో జీవించాలి.. 

ప్రతి ఒక్కరూ ఆయన కొరకు , ఆయనలో జీవించాలి..

 ఆమెన్ ...