పల్లవి :
మహదానందమైన నీదు సన్నిది
ఆపత్కా లమందు దాగు చోటది..
మనవులు ఆన్నియు ఆలకించిన..
వినయముగలవారికి ఘనతనిచ్చిన..
నీ సింహాసనము స్థాపించుటకు..
నీవు కోరుకున్న సన్నిధానము..(2)
ఎంత మధురము నీ ప్రేమ మందిరం
పరవశమే నాకు యేసయ్యా...(2) " మహాదాన"
చరణం :
1) విసిగిన హృదయం కలవరమొంది
వినయము కలిగి నిన్ను చేరగ
పరమందుండి నీవు కరుణచూపగా..
లేత చిగురుపైన మంచు కురియు రీతిగా..(2)
ప్రేమను చూపి - బాహువు చాపి
నీలో నన్ను లీనము చేసిన (2)
ప్రేమసాగరా జీవితాంతము
నీ సన్నిధిని కాచుకొందును (2) " మహాదాన"
2) లెక్కించలేని స్తుతులతో నీవు
శాశ్వత కాలము స్తుతినొందెదవు..
మహిమతో నీవు సంచరించగా..
ఏడు దీప స్తంభములకు వెలుగు కలుగగా (2)
ఉన్నతమైన ప్రత్యక్షతను
నే చూచుటకు కృపనిచ్చితివి (2)
కృపాసాగరా వధువు సంఘమై
నీకోసమే వేచియుందును.. (2) "మహాదాన"
3) సీయోను శిఖరమే నీ సింహాసనము
శుద్ధులు నివసించు మహిమనగరము (2)
ఎవరు పాడలేని క్రొత్త కీర్తన
మధురముగా నీయెదుట నేను పాడెడ (2)
సౌందర్యముగా అలంకరించిన
నగరములోనే నివసించెదను (2)
ప్రేమపూర్ణుడా మహిమాన్వితుడా..
నీతోనే రాజ్యమేలెద (2) "మహాదాన"