ప్రేమే శాశ్వతమైన - పరిశుద్ధమైన పొదరిల్లు || 2 ||
మనస్సే మందిరమాయె - నా మదిలోదీపము నీవే
నిన్నాశ్రయించిన వారిని - ఉదయించు సూర్యునివలేనే
నిరంతరం నీ మాటతో - ప్రకాశింపజేయుదువు ||ప్రేమే||
. అమరమైన నీ చరితం - విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరచిన - పరివర్తనక్షేత్రము || 2 ||
ఇన్నాళ్లుగ నను స్నేహించి - ఇంతగ ఫలింపజేసితివి
ఈ స్వరసంపదనంతటితో - అభినయించి నే పాడెదను
ఉండలేను - బ్రతుకలేను
నీతోడు లేకుండా - నీ నీడలేకుండా ||ప్రేమే|| కమ్మనైనా నీ ఉపదేశము - విజయమిచ్చే శోధనలో
ఖడ్గముకంటే బలమమైన వాక్యము - ధైర్యమునిచ్చే నా శ్రమలో ||2 ||
కరువుసీమలో సిరులోలికించెను - నీ వాక్యప్రవాహము
గగనము చీల్చి మోపైన దీవేన వర్షము కురుపించితివి
ఘనమైన నీ కార్యములు వివరింప నా తరమా- వర్ణింప తరమా ||ప్రేమే||
విధిరాసిన విషాదగీతం సమసిపోయే నీ దయతో
సంబరమైన వాగ్దానములతో నాట్యముగా మార్చితివి ||2||
మమతల వంతెన దాటించి మహిమలో స్థానమునిచ్చితివి
నీ రాజ్యములో జేష్టులతో యుగయుగములు నే ప్రకాశించనా
నా పైన ఎందుకింత గాడమైన ప్రేమ నీకు మరువలేను యేస్సయ్య ||ప్రేమే||