కరుణా సంపన్నుడా ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే నిరంతరం నేను ప్రకటించెదా (2)
నాపైన ప్రేమ చూపించి నా కొరకు త్యాగమైతివే
నా యేసయ్యా సాత్వీకుడా
నీకోసమే నా జీవితం ||కరుణా||
1. ఏ నాడు నను వీడని - నీ ప్రేమ సందేశము
2. నా హృదయసీమలోనే - సందడిని చేసెను (2)
3. అణువణువును బలపరిచే - నీ జీవపువాక్యమే
4. ప్రతిక్షణము దరిచేరి - నన్నే తాకెను (2)
5. ఆ వాక్యమే ఆరోగ్యమై జీవింపజేసి నన్నే నడిపించెను ||కరుణా||
2. ఈ వింత లోకంలో - నీ చెంత చేరితిని
3. ఎనలేని ప్రేమలోనే - ఆదరణ పొందితిని (2)
4. నీ కృపలో నిలిపినది - నీ ప్రేమ సంబందమే
5. అనుదినము మకరందమే - నీ స్నేహబంధము (2)
6. ఆ ప్రేమలోనే కడవరకు నన్ను నడిపించుమా - స్థిరపరచుమా ||కరుణా||
3. నే వేచియున్నాను - నీ మహిమ ప్రత్యక్షతకై
4. నాకున్నా ఈ నిరీక్షణనే - సన్నిధిలో నిలిపినది (2)
5. నా కోసం నిర్మించే - సౌందర్యనగరములో
6. ప్రణమిల్లి చేసెదను - నీ పాదాభివందనం (2)
7. తేజోమయా నీ శోభితం - నే పొందెద కొనియాడెద ||కరుణా||