అగ్నిజ్వాల వంటి కన్నులు కలవాడా
అపరంజిని పోలిన పాదములు కలవాడా
యేసయ్యా స్తోత్రము - యేసయ్యా స్తోత్రము
మొదటి వాడా - కడపటి వాడా
మృతుడై మరల - లేచిన వాడా } 2|| అగ్నిజ్వాల ||
యేడు నక్షత్రములు కలిగిన వాడా
దేవుని యేడు ఆత్మలు కలిగినవాడా } 2|| అగ్నిజ్వాల ||
సత్య స్వరూపి పరిశుద్ధాత్ముడా
ధవళ వర్ణుడా - రత్న వర్ణుడా } 2|| అగ్నిజ్వాల ||