అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు Ade ade aa roju

 


అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు

ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు|| అదే అదే ||


వడగండ్లు కురిసే రోజు భూమి సగం కాలే రోజు } 2

నక్షత్రములు రాలే రోజు నీరు చేదు అయ్యే రోజు

ఆ నీరు సేవించిన మనుషులంతా చచ్చే రోజు|| అదే అదే ||


సూర్యుడు నలుపయ్యే రోజు చంద్రుడు ఎరుపయ్యే రోజు } 2

భూకంపం కలిగే రోజు దిక్కు లేక అరచే రోజు

ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు|| అదే అదే ||


మిడతల దండొచ్చే రోజు నీరు రక్తమయ్యే రోజు } 2

కోపాగ్ని రగిలే రోజు పర్వతములు పగిలే రోజు

ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాధుడు లేడు|| అదే అదే ||


వ్యభిచారులు ఏడ్చే రోజు మోసగాళ్ళు మసలే రోజు } 2

అబద్ధికులు అరచే రోజు దొంగలంతా దొరికే రోజు

ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు|| అదే అదే ||


పిల్ల జాడ తల్లికి లేక తల్లి జాడ పిల్లకు లేక } 2

చేట్టుకొక్కరై పుట్టకొక్కరై అనాథలై అరచే రోజు

ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు|| అదే అదే ||


ఓ మనిషి యోచింపవా నీ బ్రతుకు ఎలా ఉన్నదో } 2

బలము చూసి భంగ పడకుమా ధనము చూసి దగా పడకుమా

ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడు లేడు|| అదే అదే ||