ప్రార్థన వినుడి పావనుడా.. prardhana vinedi paavanuda song

 


ప్రార్ధన వినెడి పావనుడా

పల్లవి:     ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా                     ..ప్రార్ధన..

1.        శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్యబృందముకు నేర్పితివి
పరముడ నిన్ను  ప్రణుతించెదము – పరలోక ప్రార్ధన నేర్పుమయా     ..ప్రార్ధన..

2.        పరమ దేవుడవని తెలిసి - కరము లెత్తి జంటగ మోడ్చి = శిరమును
వంచి సరిగమ వేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయా                        ..ప్రార్ధన..

3.        దినదినంబు చేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ = దీనుడవయ్యు
దిటముగ కొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయా                            ..ప్రార్ధన..

4.        శత్రుమూక నిను చుట్టుకొని - సిలువపై నిను జంపగను
శాంతముతో నీ శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా           ..ప్రార్ధన..