నన్నేతగానో ప్రేమించెను.. nannenthaganoo preminchedanu

 



నన్నెంతగానో ప్రేమించెను – నన్నెంతగానో కరుణించెను

నా యేసుడు నా పాపము – నా శాపము

తొలగించెను నను కరుణించెను (2)|| నన్నెంతగానో ||


సాతాను బంధాలలో – జీవంపు డంబాలలో (2)

పడనీయక దరి చేరనీయక (2)

తన కృపలో నిరతంబు నను నిల్పెను (2)|| నన్నెంతగానో ||


సత్యంబు జీవంబును – ఈ బ్రతుకు సాఫల్యము (2)

నేర్పించెను నాకు చూపించెను (2)

వర్ణింపగా లేను ఆ ప్రభువును (2)|| నన్నెంతగానో ||


కల్వరి గిరిపైనను – ఆ సిలువ మరణంబును (2)

నా కోసమే యేసు శ్రమ పొందెను (2)

నా పాపమంతటిని క్షమియించెను (2)|| నన్నెంతగానో ||


ఘనమైన ఆ ప్రేమకు – వెలలేని త్యాగంబుకు (2)

ఏమిత్తును నేనేమిత్తును (2)

నను నేను ఆ ప్రభుకు సమర్పింతును (2)|| నన్నెంతగానో |