ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా } 2
కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా } 2
అనుదినము నీ అనుగ్రహమే
ఆయుష్కాలము నీ వరమే } 2|| ఘనమైనవి ||
యే తెగులు సమీపించనీయక – యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్ని తొలగే వరకు – ఆత్మలో నెమ్మది కలిగే వరకు } 2
నా భారము మోసి – బాసటగా నిలిచి – ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము|| ఘనమైనవి ||
నాకు ఎత్తైన కోటవు నీవే – నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే – శాశ్వత కృపకాధారము నీవే } 2
నా ప్రతిక్షణమును నీవు – దీవెనగా మార్చి – నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే – చెల్లించెదను – జీవితాంతము|| ఘనమైనవి ||
నీ కృప తప్ప వేరొకటి లేదయా – నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్న స్థితిలో – నీ కృప నా యెడ చాలునంటివే } 2
నీ అరచేతిలో నను – చెక్కుకుంటివి – నాకేమి కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము|| ఘనమైనవి ||